Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చి నెలాఖరు నుంచి మళ్లీ గొర్రెల పంపిణీ
- అసెంబ్లీలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో ప్రస్తుతం 1.91 కోట్ల గొర్రెలు ఉన్నాయనీ, 75 శాతం సబ్సిడీ కింద మొత్తం రూ.5001.53 కోట్లు ఖర్చు చేశామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పారు. రాష్ట్రంలో కుల వృత్తుల ప్రోత్సాహం, గొర్రెల పంపిణీ అంశాలపై ఎమ్మెల్యేలు నోముల భగత్, చల్లా ధర్మారెడ్డి, రవిశంకర్ సుంకె శాసనసభలో అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. 18 సంవత్సరాలు నిండిన గొల్ల కురుమలు అందరికీ గొర్రెలు ఇస్తామన్నారు. మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారం నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు కేంద్రంగా ఈ కార్యక్రమం జరుగుతుందనీ, గొల్ల కురుమలు అందరూ డీడీలు కట్టాలని కోరారు. మొదటి దశ గొర్రెల పంపిణీలో 75శాతం సబ్సిడీగా రూ.3,751.15 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి 82.64 లక్షల గొర్రెల కొనుగోలు చేసి, సొసైటీల్లోని 3,93,552 మందికి పంపిణీ చేసినట్టు వివరించారు.