Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు ఎంపీటీసీలు, ఒక ఉప సర్పంచ్ వారి అనుచరులతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్ మంత్రుల సముదాయంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ మోసం బట్టబయలైందనీ, జాతీయత పేరుతో దేశద్రోహానికి పాల్పడ్డారనీ, ఒకరిద్దరికి దేశ సంపదను కట్ట బెడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.