Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
శాసనసభలో టీఎస్ఆర్టీసీపై చర్చను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వాయిదా వేశారు. గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, కాలె యాదయ్య, అంజయ్య యెల్గనమోని టీఎస్ఆర్టీసీ సరకు రవాణా, సంస్థ ఆర్ధిక స్థిరత్వాన్ని పెంచ డానికి తీసుకుంటున్న చర్యలు, సబర్బన్ బస్సుల పెంపు దల అంశాలపై ప్రభుత్వానికి రాతపూర్వకం గా ప్రశ్న లు అడిగారు.ఈ అంశంపై ప్రభుత్వ వినతి మేరకు చర్చను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటిం చారు. ఇదే అంశంపై శాసనమండలిలో ఎమ్మెల్సీ అలుగు బెల్లి నర్సిరెడ్డి అడిగిన ప్రశ్నకు హరీశ్‌రావు సమాధానం చెప్పిన విషయం తెలిసిందే.