Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కంటివెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. గురువారం ఆమె అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. ఆమె మాట్లాడుతూ కంటి వెలుగు అనేది ప్రపంచంలోనే అతి పెద్ద సామాజిక కంటి పరీక్షల కార్యక్రమని అని తెలిపారు. సీఎస్తో పాటు రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఎమ్మెల్సీలు తాత మధు, కౌశిక్ రెడ్డి కూడా కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో ఉన్నారు.