Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వం కనీసం నాలుగు, ఐదు గంటల కరెంటు కూడా ఇవ్వలేని ప రిస్థితి. ఎప్పుడు ఇస్తున్నారో, ఏ సమయంలో ఇస్తున్నారో తెలువదు. వాయి దా తీర్మానం ఇస్తే స్పీకర్ తిరస్కరించారు. ఆవేదనతో నిరసన తెలిపి బయ టికి వచ్చాం. రైతుల సమస్యలపై చర్చించే చిత్తశద్ధి ఈ ప్రభుత్వానికి లేదు.
స్పీకర్ తీరు బాధాకరంములుగు ఎమ్మెల్యే సీతక్క
'రైతుల ఆవేదన అర్థం చేసుకుని మేము వాయిదా తీర్మానం ఇస్తే స్పీ కర్ తిరస్కరించడం బాధాకరం. మిర్చి, వరి ఇతర పంటలు వేసిన రైతులు నష్టపోతున్నారు. రైతులు ఆత్మహత్య చేసుకునే ప్రమాదం పొంచి ఉంది.'
విద్యుత్ కొనుగోలు ప్రతిపాదన వాస్తవామా? కాదా?
ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు
'విద్యుత్ కొనుగోలు చేయడానికి డిస్కంలు ప్రతిపాదన పెట్టాయా? లేదా? వాస్తవమా కాదా? చెప్పాలి. కొనుగోలు చేయకుంటే రైతులు ఇబ్బంది పడతారని పత్రికల్లో వచ్చిన వార్తలు నిజం కాదా? వివిధ రూపాల్లో వినియోగదారుల నుంచి ఏసీడీ చార్జీలు వసూలు చేస్తున్నారు.