Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీజీవో ఇంటర్ విద్యాఫోరం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ జవాబు పత్రాల ఆన్లైన్ మూల్యాంకనమనేది ఒక విప్లవాత్మక మార్పు అని టీజీవో ఇంటర్ విద్యాఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ వెంకటేశ్వర్లు, ఎండీ ఇస్మాయిల్, అసోసియేట్ ప్రెసిడెంట్ వి ప్రవీణ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సస్పెండైన మధుసూదన్‌రెడ్డి ఇంటర్ విద్యా కమిషనర్‌పై కక్షపూరిత ధోరణితో నిరాధార ఆరోపణలు చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆన్లైన్ మూల్యాంకనంపై భయాందో ళనలు సృష్టించడం సరైంది కాదని పేర్కొన్నారు. సాంకేతిక విద్యాశాఖలో మూడేండ్ల నుంచి ఆన్లైన్ మూల్యాంకనం కొనసాగుతున్నదని వివరించారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న మధుసూదన్‌రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.