Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్టీయూటీఎస్ ఆవిర్భావ దినోత్సవంలో ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తు న్నామని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి చెప్పారు. పీఆర్టీయూటీఎస్ 52వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం హైదరాబాద్లోని ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించారు. సంఘ పతాకాన్ని పీఆర్టీయూటీఎస్ అధ్య క్షులు పింగిలి శ్రీపాల్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ పోరాటాల ఫలితంగా పంచాయతీరాజ్ టీచర్లకు పెన్షన్, గ్రామీణ ప్రాంత హెచ్ఆర్ఏ, ప్రసూతి సెలవులు, 010 పద్దు కింద వేత నాలు, ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్, పీఎస్హెచ్ఎం పోస్టుల మంజూరయ్యా యని వివరించారు. 40 జీవో నెంబర్ 40 ద్వారా ఎంఈవో, ప్రధానోపాధ్యా యులకు అధికారాలొచ్చాయని చెప్పారు.