Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండలిలో మంత్రి హరీశ్ రావు
- ఆదివారానికి మండలి వాయిదా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపిస్తూ ఆర్థిక సహకారం అందించకపోగా, హక్కుగా రావాల్సిన వాటిని ఇవ్వకుండా వేధిస్తున్నదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. శాసనమండలిలో బడ్జెట్‌పై రెండు రోజుల పాటు జరిగిన చర్చకు గురువారం ఆయన సమాధానమిచ్చారు. వివక్ష చూపిం చినా...రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఆగలేదని తెలిపారు. దేశంలో మిగిలిన రాజకీయ పార్టీలకు బీఆర్ఎస్ భిన్నమైందనీ, ఆ పార్టీలు ఎన్నికలప్పుడు హామీలిచ్చి మరిచిపోతాయనీ, బీఆర్ఎస్ ఇవ్వని హామీలను కూడా అమలు చేసిందని తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తదితర పథకాలతో రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మార్గదర్శకంగా నిలిచిందని చెప్పారు. రైతులపై కేంద్రం కక్ష కట్టిందనీ, ఆ వర్గానికి సంబంధించిన పలు పథకాలకు కోత విధిం చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయింపులో కోతలను కేంద్ర కొనసాగించిందని తెలిపారు. రాష్ట్రం సమ్మిళిత బడ్జెట్‌ను ప్రవేశపెడితే, కేంద్రం కార్పొరేట్లకు దోచి పెట్టే బడ్జెట్ పెట్టిం దని విమర్శించారు.
కేంద్రం చేసిన అప్పుల కన్నా రాష్ట్రం తక్కువగా అప్పులు చేసిం దని తెలిపారు. రాష్ట్రానికి హక్కు గా రావాల్సిన వాటిని సాధించడంపై లేని శ్రద్ధ చూపని బీజేపీ రాష్ట్ర నాయకులు భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్దిపొం దాలని చూస్తున్నారని విమర్శించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్లో ఫసల్ బీమా పథకం పనికి రాదనీ అమలు చేయడం లేదనీ, రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఇక్కడెందుకు గొప్పలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల
కన్నా ఎక్కువ జీతాలు
రెండో ఏఎన్ఎంలు, ఆశావర్కర్లకు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కన్నా అధికంగా జీతాలిస్తున్నామని రాజస్థాన్, గుజరాత్ తదితర రాష్ట్రాలతో పోల్చి మంత్రి హరీశ్ రావు వివరించారు. దసరా నాటికి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి వస్తుందని తెలిపారు.