Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
'శాసనసభ సమావేశాలు వాస్తవాలకు దగ్గరగా ఉండాలి. సభాపతులు అధికార పార్టీకి వంత పాడుతున్నట్టు ఉన్నది. 24 గంటల ఉచిత విద్యుత్ కేవలం ఊత పదమైంది. కనీసం 13 గంటలు విద్యుత్ కూడా ఇవ్వడం లేదు'' అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. రైతాంగం సబ్ స్టేషన్ల ముందు ధర్నా చేస్తుంటే వీరికి కనబడటం లేదు.. మీరు పెట్టిన కంటి వెలుగులో కంటి పరీక్షలు చేయిం చుకోండి. అప్పుడన్నా కనబడుతది అని బీఆర్ఎస్ మంత్రులకు సూచించారు. ''బరితెగించి అబద్ధాలు మాట్లాడుతున్నారు. శాసన సభాపతి, శాసన మండలి అధ్యక్షులు.. మాతో రండి సమస్య ఏంటో చూపిస్తాం. పత్రికలు, టీవీల్లో నిత్యం రైతుల ఆందోళనలు వీళ్లకు కనబడటం లేదు. ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అంశా లపై కాకుండా వాళ్ల మాటలు వాళ్లవే. 24 గంటల ఉచిత విద్యుత్‌పై శాసన మండలిలో వాయిదా తీర్మానం పెట్టాను. సభాధ్యక్షులు దాన్ని తిరస్కరించడం ఎందుకు? వాస్తవాలు వెలుగులోకి వస్తాయనా?' అని ప్రశ్నించారు.