Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్కడికక్కడ నాయకుల అడ్డగింత
నవతెలంగాణ- విలేకరులు
ఇండ్లు, ఇండ్ల స్థలాల సాధన కోసం చలో హైదరాబాద్ కార్యక్రమానికి బయలుదేరిన పేదలు, ప్రజాసంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అడ్డగించి ముందస్తు అరెస్టులు చేశారు. కేవీపీఎస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్‌ను బుధవారం రాత్రి ఇంటి వద్ద అరెస్టు చేసి టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పెనుబల్లి మండల కేంద్రంలో సీపీఐ(ఎం), సీపీఐ, ప్రజాపంథా పార్టీ నాయకులను అరెస్టు చేశారు. నల్లగొండ పట్టణంలోని కతాలగూడలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్యను అరెస్టు చేసి వన్‌టౌన్‌కు తరలించారు. నాంపల్లిలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళిని అరెస్టు చేశారు. మర్రిగూడలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, ప్రజా నాట్యమండలి జిల్లా కన్వీనర్ పాండురంగారావులను అరెస్టు చేశారు. దామరచర్లలో గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మాలోతు వినోద్ నాయక్, ప్రజా సంఘాల నాయకులు పాపానాయక్, వినోద్, సుబాని, రవి, పిచ్చయ్యను ముందస్తు అరెస్టు అయ్యారు. పెద్దపల్లి జిల్లాలో సీపీఐ(ఎం), సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్, పట్నం తదితర ప్రజాసంఘాల నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వై.యాకయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేల్పుల కుమార స్వామి, ఎ.ముత్యంరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మంద రాజేందర్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్, అధ్యక్షుడు ప్రశాంత్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అశోక్‌ను అరెస్టు చేశారు. రాజ న్న సిరిసిల్ల జిల్లాలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మూషం రమేష్, జిల్లా కమిటీ సభ్యుడు కోడం రమణ, నాయకులు ఎలిగెటి రాజశేఖర్‌ను అరెస్టు చేశారు.