Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన కళాశాల ఎదుట విద్యార్థుల ధర్నా
నవతెలంగాణ-రాజేంద్రనగర్
ఉద్యాన రంగాల్లో హెచ్ఈఓ పోస్టుల భర్తీకై వెంటనే జీవోను విడుదల చేయాలని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన కళాశాల ఎదుట విద్యార్థులు గురువారం ధర్నా నిర్వహించారు. హెచ్ఈఓ పోస్టుల భర్తీకై ప్రభుత్వం స్పష్టమైన హామీ వచ్చే వరకూ ధర్నా విరమించబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ఉద్యానవన యూనివర్సిటీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఉద్యోగాల నియామకాలకు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగాలు లేకపోతే తాము చదివి ఏం లాభం అని వాపోతున్నారు. వ్యవసాయం, వెటర్నరీలలో విస్తరణ అధికారులను ప్రభుత్వం నియమించి ఉద్యానవన రంగంలో ఎందుకు నియమించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ధర్నా విరమించకపోవడంతో యూనివర్సిటీ అధికారులు హాస్టల్, మెస్‌కు తాళం వేశారు. అయినా విద్యార్థులు ధర్నా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ విస్తరణ సంచాలకులు కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ విషయం తమ పరిధిలో లేదని, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తామని తెలిపారు.