Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రశ్నకు ఆర్థికమంత్రి హరీశ్‌రావు సమాధానం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రభుత్వరంగంలోని ఆర్టీసీని అమ్మేస్తే, ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్రప్రభుత్వం పదే పదే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నదని ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఉన్నది కాబట్టే, ఆర్టీసీకి ఏటా రూ.1,500 కోట్లు గ్రాంటుగా ఇస్తూ సంస్థను పరిరక్షిస్తున్నామని చెప్పారు. గురువారం శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆర్టీసీ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న రెండు పీఆర్సీల చెల్లింపు, కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెస్తున్న స్క్రాప్ చట్టం ద్వారా ఆర్టీసీలో 3వేలకు పైగా బస్సులు తగ్గిపోతున్న అంశాలను సభలో ప్రస్తావించి, ఆర్థికమంత్రి సమాధానం ఇవ్వాలని కోరారు. దీనిపై మంత్రి హరీశ్‌రావు పై విధంగా స్పందించారు.
రాష్ట్రంలో కేసీఆర్ లేకుండా ఇంకే ప్రభుత్వం ఉన్నా, ఆర్టీసీని ఇప్పటికే అమ్మేసి ఉండేవారని వ్యాఖ్యానించారు. కానీ సీఎం కేసీఆర్ ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకు కట్టుబడి ఉన్నారని చెప్పారు.