Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.17.2 కోట్లతో ఏర్పాటు చేసిన హెచ్ఎండీఏ
- ప్రారంభించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
జంట నగరాలను కలిపే చారిత్రాత్మక హుస్సేన్‌సాగర్ బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ (బిపిపి) పరిసరాలను అత్యంత ఆకర్షణీయంగా, పర్యాటక కేంద్రంగా తీర్చిది ద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. హుస్సేన్‌సాగర్, లుంబినీ పార్క్ సమీపంలో రూ.17.2 కోట్ల వ్యయంతో హెచ్ఎండీఏ రూపొందించిన ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటెన్‌ను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహ మూద్ అలీ గురువారం ప్రారంభించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయరెడ్డి, ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్‌తో కలిసి మ్యూజికల్ ఫౌంటెన్‌ను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ నగ రానికి అపూర్వ ఆదరణ ఉందని, ట్యాంక్ బండ్ పరిసరాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మంత్రి కేటీఆర్ ఆలోచనలకనుగుణంగా హెచ్ఎండీఏ అధికా రులు ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటెన్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారని అభినందిం చారు. ఇప్పటివరకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మంత్రి కేటీఆర్ ఆదేశాలతో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్‌కుమార్ పర్యవేక్షణలో అతి తక్కువ సమయంలో హుస్సేన్ సాగర్‌లో అతిపెద్ద ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటెన్ రూ.17.2 కోట్లతో హెచ్‌ఎండీిఏ ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటికే ట్యాంక్‌బండ్ సుందరీకరణ (బ్యూటిఫికేషన్) పనులను హెచ్ఎండీఏ విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. పీవీ మార్గ్ (నెక్లెస్ రోడ్)వెంట మరికొన్ని ఆకర్షణీయమైన అంశాలను చేకూర్చేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తోందన్నారు.