Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేతగాదని చెప్పండి..జర్నలిస్టులకు నేను ఇండ్లస్థలాలిప్పిస్తా : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు భూములకు పట్టాలపై సీఎం కేసీఆర్ మరో డ్రామాకు తెరదీశారనీ, తక్షణమే పట్టాలియ్యకుంటే పేదలంతా ఫాంహౌజ్ ను ఆక్రమించుకుని దున్నడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ హెచ్చరిం చారు. శుక్రవారం హైదరాబాద్‌లో సిరి సిల్ల సెస్ మాజీ వైస్ చైర్మెన్, శ్రీనివాస సేవాసంస్థ అధినేత లగిశెట్టి శ్రీనివాస్, అతని అనుచరులు బీజేపీలో చేరారు. బండి మీడియాతో మాట్లాడారు. ప్రశ్నిం చే జర్నలిస్టుల గొంతు నొక్కుతున్న రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమంలో టాప్ అన డం సిగ్గు చేటన్నారు. 1100 మంది జ ర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వాలని సుప్రీం కోర్టు చెప్పి ఆరు నెలలు దాటు తున్నా సీఎం కేసీఆర్ స్పందించలేదని విమర్శిం చారు. జర్నలిస్టులకు ఇండ్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉందనీ, కేసీఆర్ కు చిత్త శుద్ధి ఉంటే జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వాల ని కేంద్రానికి ప్రతిపాదన లు పంపాలని కోరారు. అలాగైతే వారం రోజుల్లో మం జూరు చేయించే బాధ్యత ను తాను తీసు కుంటానన్నారు. దమ్ముం టే కేసీఆర్ ప్రతిపాదనలు పంపా లని సవాల్ విస ిరారు. ప్రభుత్వ భవనాలను కూల్చే సం స్కృతి తమది కాదన ా్నరు. పాతబస్తీలో విద్యుత్ చౌర్యం నిరూపిస్తాననీ, ద మ్ముంటే తనతో రావాలని సవాల్ విసి రారు. చేనేత బంధు హామీ ఏ మైందని ప్రశ్నించారు. మోడీని తిట్టేందుకే అసెం బ్లీ సమావేశాలు నిర్వహిస్తు న్నట్టుగా ఉం దని విమర్శించారు. పేదలకు కేంద్ర ప్ర భుత్వం2.5 లక్షల ఇండ్లను మంజూరు చేస్తే ఆ నిధులను కేసీఆర్ దారిమళ్లిం చారని ఆరోపించారు.