Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రజక వృత్తిదారుల సంఘం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర బడ్జెట్లో రజక వృత్తిదారుల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించలేదనీ, అందువల్ల కేటాయింపుల్ని సవరించాలని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్ కోసం రజక ఫెడరేషన్ బడ్జెట్ నుండి కాకుండా ప్రత్యేకంగా ఇతర వర్గాలకు కేటాయించిన విధంగా సబ్సిడీ లాగా ప్రభుత్వమే భరించాలని కోరారు. ఆధునిక దొబీఘాట్ల కోసం ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని కోరారు.గతేడాది కేటాయించిన నిధులు రూ:53 కోట్ల నిధులు ఎందుకు ఖర్చు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. గతేడాది బడ్జెట్ను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల అనేక జిల్లాలో విద్యుత్ ప్రమాదాల వల్ల, ఇస్త్రీ దుకాణాలు కాలిపోయి వృత్తిదారులు ఆర్థికంగా నష్టాలకు గురయ్యారని తెలి పారు. వారందరినీ ఆర్థికంగా ఆదుకోవాడానికి బీమా తరహాలో ఆర్థిక పథకం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రజక వృత్తిదారుల సంక్షే మానికి వెలువడిన అన్ని రకాల జీ.వోలని తెలంగాణ ప్రభుత్వానికి అనువదించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే రజకుల సామాజిక భద్రతకు ప్రత్యేక చట్టం చేయాలని కోరారు.