Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు 317 బాధిత టీచర్ల విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు జన్మదినం (ఈనెల 17న) కానుకగా 317 జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులను వారి సొంత జిల్లాలకు పంపించాలంటూ 317 జీవో తెలంగాణ ఉపాధ్యాయ బాధితుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు శుక్రవారం ఆ సంఘం అధ్యక్షులు విజరుకుమార్, ప్రధాన కార్యదర్శి దత్తాద్రి లేఖ రాశారు. ఈ కోర్కె సాధన కోసం శనివారం అసెంబ్లీ వద్దకు రావాలని నిర్ణయించామని తెలిపారు. శాంతి యుతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. స్థానికతను కోల్పోవడం వల్ల తల్లిదండ్రులు, పిల్లలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తూ మానసిక ఒత్తిడికి గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. తమ పిల్లలకు భవిష్యత్తులో స్థానికత విషయంలో తీవ్ర అన్యాయం జరగబోతుందని తెలిపారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహించడం వల్ల మహిళా ఉపాధ్యాయులు తీవ్ర కష్టాలను అనుభవిస్తు న్నారని పేర్కొన్నారు. అందువల్ల వారిని స్థానిక జిల్లాలకు పంపి తమ కుటుంబాల ఆవేదనను తీర్చాలనీ, పిల్లలకు సంతోషాన్ని ప్రసాదించాలని కోరారు.