Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర మైనారిటీ కమిషన్ సలహాదారులు ఏకేఖాన్
- దోమకొండ కోటలో తెలంగాణ ఉర్దూ సాహిత్య కవి సమ్మేళనం
నవతెలంగాణ-దోమకొండ
చారిత్రక వారసత్వ కట్టడాలను పరిరక్షించుకోవాలని రాష్ట్ర మైనారిటీ కమిషన్ సలహాదారులు ఏకే ఖాన్ అన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని గడికోటలో సంస్థాన వారసులు కామినేని అనిల్ శోభన ఆధ్వర్యంలో శనివారం ఉర్దూ కవి సమ్మేళనం నిర్వహించారు. గతంలో దోమ కొండ సంస్థానం వారి ఆధ్వర్యంలో ఉర్దూ సాహిత్యానికి అందించిన సేవ.. ముఖ్యంగా రాజరాజేశ్వరరావు ఆరు భాషల్లో తెలంగాణ సాహిత్యానికి అందిం చిన సేవలపై వక్తలు మాట్లాడారు. ఈ సందర్భంగా ఏకే ఖాన్ మాటా ్లడుతూ.. ప్రపంచ వారసత్వ కట్టడాలలో దోమకొండ కోటకు యూనెస్కో అవార్డు రావడం చాలా సంతోషమని, వారసత్వ కట్టడాలను కాపాడు కోవాలని అన్నారు. రాష్ట్రంలో ఇంకా ఎన్నో ముఖ్యమైన సంస్థానాలు ఉన్నట్టు తెలిపారు. వాటిని కూడా పునరుద్ధరించాలన్నారు. ఇక్కడ ఉర్దూ సాహిత్యం కవి సమ్మేళనం నిర్వహించడం చాలా సంతోషకరమని చెప్పారు. మన సంస్కృతి, సంస్కారం, సాహిత్యం.. ఈ మూడింటి ద్వారా త్వరగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడికోట వారసులు కామినేని అనిల్ కుమార్, కలెక్టర్ జితేష్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ కానుగంటి శారద నాగరాజు, జెడ్పీటీసీ తిరుమల గౌడ్, గడి ట్రస్ట్ మేనేజర్ బాబ్జి తదితరులు పాల్గొన్నారు.