Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎల్పీనేత భట్టి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు అంటున్నారు.. అలాంటప్పుడు ప్రతిపక్షాలు చూడ్డానికి ఎందుకు వెళ్లనీయటం లేదు'అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శనివారం అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా ప్రభు త్వాన్ని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే రాష్ట్రం వచ్చిం దన్న ఆయన.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు.. రూ.18 లక్షల ఎకరాల ఆయకట్టు అన్నారు.. కానీ కాల్వల నిర్మాణం మాత్రం జరగలేదని విమ ర్శించారు. అన్నారం, సుందిళ్ల వద్ద వరద నీటితో పంటపొలాలు నీట మునుగుతున్నాయని గుర్తుచేశారు. ఆయా రైతులను ఆదుకోవాలని డి మాండ్ చేశారు. ప్రాణహిత ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలని కోరారు. దే వాదుల ప్రాజెక్టు ఎందుకు కట్టడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే అనేక ప్రాజెక్టులు కట్టామని చెప్పారు. రంగారెడ్డి పాల మూరు ఆగిపోయిందని అన్నారు. ఆ ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తి చేస్తా రో చెప్పాలన్నారు. దీనికి జాతీయ ప్రాజెక్టు హౌదా సాధించాలన్నారు. సమస్యలను సభ దృష్టికి తీసుకొస్తుంటే.. మైక్ కట్ చేస్తున్నారనీ, ఇది కట్టే సి కొట్టినట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తన మైకు కట్ చేసి మంత్రి కి మాట్లాడేందుకు ఇచ్చారని భట్టి తెలిపారు. హౌంశాఖలో పదోన్న తుల సమస్య ఉన్నదని తక్షణ పరిష్కారం చేయాలని ఆయన ఈ సంద ర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. హౌంగార్డులు కొన్నేండ్లుగా పనిచేస్తున్నా రనీ, వారిని పర్మినెంట్ చేయాల్సిన అవసరముందన్నారు. శాంతి భద్రతల సమస్యను మరింత సమర్థవంతంగా కాపాడాలన్నారు. కానిసే ్టబుల్ ని యామకాల నిబంధనలు కూడా గందరగోళంగా ఉన్నాయన్నా రు. ఆస్ప త్రుల పనితీరుపై మరింత విజిలెన్స్ అవసరముందని చెప్పారు. గాంధీలో కాలం చెల్లిన మందులు ఇస్తున్నట్టు వార్తలొస్తున్నాయని గుర్తుచేశారు. ప్రయివేట్ ఆస్పత్రుల్లో బిల్లులపై మానిటరింగ్ వ్యవస్తను ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతున్నదనీ, వారి కోసం ఒక ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.