Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యేలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హర్షవర్ధన్‌రెడ్డి, గువ్వల బాలరాజ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఆరు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు పంచాయతీరాజ్ చట్టంలో సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని బోయలపల్లి, తాళ్లనర్సింహపల్లి రెండు గ్రామాలను గ్రామపంచాయతీలుగానే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శనివారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడారు. 2011లో ఉన్న విధంగానే ప్రజల అభీష్టం మేరకు గ్రామపంచాయతీలుగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు. కొత్తగా ఏర్పాటు అయిన మున్సిపాలిటీల పరిధిలో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అచ్చంపేట మున్సిపాలిటీ నుంచి ఏనిమిది గ్రామాలను వేరు చేసి ప్రజల అభీష్టం మేరకు గ్రామ పంచాయతీలుగానే కొనసాగిస్తూ చట్టం చేయడం శుభపరిణామమన్నారు.