Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రామగుండం మెడికల్ కాలేజీకి సంబంధించిన ఆడ్మిషన్లలో సింగరేణి కార్మికుల పిల్లలకు రిజర్వేషన్లు కల్పిస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.శనివారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ ఆ ఆస్పత్రికి సింగరేణి పేరు పెడతామని.. సింగరేణి కార్మికులకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆ సంస్థ సౌజన్యంతో రామగుండంలో మెడికల్ కాలేజీ నిర్మిస్తున్న నేపథ్యంలో సింగరేణి కార్మికులకు ప్రత్యేక వార్డులు పెట్టాలనీ, ఆ కార్మికుల పిల్లలకు ఎంబీబీఎస్ అడ్మిషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలని ఆదేశించారు.