Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
త్వరలో హైదరాబాద్ పాతనగరంలోని లాల్ దర్వాజ అమ్మవారి ఆలయ విస్తరణ పనులు ప్రారంభించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం అసెంబ్లీ సమావేశ మందిరంలో ఆయన ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే బలాలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయ విస్తరణకు కోసం అవసరమైన 1,10 గజాల స్థలాన్ని గుర్తించామనీ, భూమి అప్పగిస్తున్న వారికి పరిహారంగా రూ.8.95 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. పేదల కోసం ఫంక్షన్ హాళ్ల నిర్మాణానికి రూ.19 కోట్లను మంజూరు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ అనీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.