Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ)లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఈనెల 15 నుంచి మార్చి రెండో తేదీ వరకు ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే.
ఆదివారం నుంచి వార్షిక పరీక్షలు పూర్తయ్యేంత వరకు డీఈసీ కన్వీనర్లు, సభ్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. మార్చి నాలుగో తేదీన నైతికత, మానవ విలువలు పరీక్ష, ఆరో తేదీన పర్యావరణ విద్య పరీ క్షలుంటాయని పేర్కొన్నారు. అదేనెల 15 నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు ఇంటర్ వార్షిక పరీక్షలుంటాయని వివరించారు.