Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాసన సభలో మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం శాసన సభలో పద్దులపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పక్షనేత మల్లు భట్టి విక్రమార్క లేవనెత్తిన ఆంశాలపై ఆయన సమాధానం చెబుతూ..మోడీ సర్కార్ ఉపాధి పథకాన్ని నీరు గారుస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో మెటీరియల్, కాంపోనెంట్ కింద 11వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని చెప్పారు. వాటికి అనేక కొర్రీలు పెట్టి నిధులను విడుదల చేయటం లేదని చెప్పారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేసి పేదల పొట్టకొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం ప్రయత్నిస్తున్నదని చెప్పారు. 2022-23 బడ్జెట్లో ఉపాధికి గతానికంటే మరింత కోత పెట్టారని వివరించారు. ఇక్కడున్న బీజేపీ నేతలు ఈ విషయంపై మాట్లాడే స్థితిలో లేరని చెప్పారు.