Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఉపాధి హామీ పనులకు కూలీలు పెద్ద ఎత్తు న హాజరయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. శనివారం ఆ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి అన్ని జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, డీఆర్డీ ఓలు, పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజనీర్ల తో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనే జీలు, కూలీల హాజరుపై సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామ పంచాయతీలో రోజూ సగటున 50 మందికి తగ్గకుండా కూలీలు హాజరు ఉండాలనీ, జిల్లావ్యాప్తంగా పదివేల మంది కూలీలు పనుల కు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించుకో వాలని ఆదేశించారు. ఈనెల 20వ తేదీలోగా 10 లక్షల వేజ్ సీకర్లు ఉపాధి పనులకు హాజర య్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పనులన్నీ నాణ్యతతో పూర్తి చేయాలని చెప్పారు. కూలీల సంఖ్యతోపాటు కనీస వేతనం రూ.257 వరకు అనుమతి ఉన్నందున సగటు కూలీ రేటు పెరగా లని అన్నారు. ఉపాధి హామీ పనులను మార్చి 25 లోగా పూర్తి చేసి, వివరాలను ఎఫ్‌టీవో ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. సమావేశంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.