Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండ ప్రకాశ్ నామినేషన్ దాఖలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ పదవికి ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈమేరకు శనివారం అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి నరసింహాచార్యులుకు ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసుధానాచారి, గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తదితరులు ఉన్నారు. అనంతరం శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో మండలి డిప్యూటీ చైర్మెన్‌గా వ్యవహరించిన నేతి విద్యాసాగర్ పదవీకాలం 2021, జూన్ 3న ముగిసింది. అప్పటినుంచి ఆ పదవి ఖాళీగా ఉన్నది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఒకే ఒక నామినేషన్ దాఖలు కావడంతో బండ ప్రకాశ్ ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే కానుంది. ఆయన పేరును ఖారారు చేసిన విషయం తెలిసిందే. డిప్యూటీ చైర్మెన్ ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఆదివారం ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభమైన తర్వాత డిప్యూటీ చైర్మెన్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
మండలి చీఫ్‌విప్‌గా బానుప్రసాదరావు
శాసనమండలి చీఫ్‌విప్, విప్‌లను నియమిస్తూ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. శాసనమండలి చీప్‌విప్‌గా టి. భానుప్రసాదరావు, విప్‌లుగా శంభీపూర్ రాజు, పాడి కౌశిక్ రెడ్డిలను నియమించారు.