Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కంటి వెలుగు కార్యక్రమంలో రికార్డు స్థాయిలో పరీక్షలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. గ్రామాలు, మున్సిపల్ వార్డులు, గ్రామ సచివాలయం, శాసన సభ, డీజీపీ కార్యాలయం, విద్యాసంస్థలు, కార్యాలయాలు, భారీ సమూహాలు ఉండే ప్రాంతాల్లో కంటి వెలుగు శిబిరాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్టు సమాచార, పౌరసంబంధాల శాఖ శనివారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 33 లక్షల 60 వేల 301 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. వారిలో 6 లక్షల 76 వేల 732 మందికి కంటి అద్దాలు ఇచ్చినట్టు తెలిపారు.
కంటివెలుగు గణాంకాలు ఇలా...
మొత్తం కంటిపరీక్షలు: 33,60,301
రీడింగ్ గ్లాసెస్ పంపిణీ: 6,76,732
ప్రిస్కిప్షన్ గ్లాసెస్ కోసం రెఫర్: 4,60,775
కంటి సమస్యలు లేనివారు: 22,22,669 మంది