Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు సుదీర్ఘ వివరణలతో కూడిన ప్రసంగాలు చేయటంతో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వారిపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగానే 13 పద్దులపై చర్చించాల్సి ఉందనే విషయాన్ని స్పీకర్ ప్రస్తావించారు. ప్రశ్నోత్తరాల్లో 10 ప్రశ్నలున్నాయనీ, ఆ విషయాన్ని గమనంలో ఉంచుకుని సభ్యులు సూటిగా మాట్లాడాలని సూచించారు. అయినా సభ్యుల్లో ఒకరిద్దరు మినహా మిగిలిన వారు పదే పదే వివరణతో కూడిన ప్రశ్నలు వేస్తుండటంతో... ఇలా అయితే అందరూ దుప్పట్లు తెచ్చుకోవాలి. రాత్రి కూడా ఇక్కడే ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు. తక్కువ ప్రశ్నలకే ఎక్కువ సమయమైందంటూ ఐదు ప్రశ్నల తర్వాత అనుబంధ ప్రశ్నలకు అవకాశం లేదంటూ ఆయన తెలిపారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో సభ్యునికి మాత్రమే మాట్లాడేందుకు అనుమతించారు.