Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి ఆన్లైన్లో నాట్ విల్లింగ్ ఆప్షన్‌కు అవకాశం కల్పించాలని ఎస్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి సదానందంగౌడ్, ఎం పర్వత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీనియార్టీ ప్రాతిపదికన తర్వాతి వారికి పదోన్నతి కల్పించాలని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పదోన్నతుల్లో ఉన్న గెజిటెడ్ హెడ్మాస్టర్ (జీహెచ్ఎం) ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి బి భుజంగరావు గెలుపుకోసం విశేష కృషి చేయాలని పేర్కొన్నారు.