Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
పండిట్, పీఈటీల ప్రమోషన్ల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ భవనంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులు ప్రమోషన్లు పొందుతుంటే పండిట్లు, పీఈటీలు ప్రమోషన్లు లేక ఆవేదన చెందుతున్నారన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీిఎస్ యూటీఎఫ్ బలపర్చిన అభ్యర్థి మాణిక్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఉంటారని, ఉపాధ్యాయ సమస్యల సాధనకై జరిగే పోరాటంలో వీరు ముందు ఉంటారని తెలిపారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్ రెడ్డి, జి.నాగమణి, నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షులు బక్క శ్రీనివాసాచారి, అరుణ, కోశాధికారి నర్రా శేఖర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు రాంబాబు, అరుణ తదితరులు పాల్గొన్నారు.