Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురికి గాయాలు
నవతెలంగాణ-పాల్వంచ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) ఏడో దశలో ప్రమాదం జరిగింది. కోల్ ప్లాంట్లోని సైలో దగ్గర శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఎలక్ట్రికల్ సిబ్బంది బ్రేకర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ పని చేస్తున్న ఏఈ విజరు, ఆర్టిజన్లు వరద రాజులు, మల్లిఖార్జున్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తోటి కార్మికులు వారిని అంబులెన్స్ ద్వారా కేటిపీఎస్ ఆస్పత్రికి తరలించారు. వారికి 35 శాతం గాయాలయ్యాయి. డాక్టర్ల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం యాజమాన్యం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కు తరలించింది. ప్రమాదానికి గల కారణాలను అధికారులు విచారిస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్లో పేలుడు..
9మంది కార్మికులకు తీవ్రగాయాలు
విశాఖ : ఆంధ్రప్రదేశ్లోని విశాఖ స్టీల్ మెల్టింగ్ షాపులో కన్వేర్ ల్యాడిల్లో ద్రావకాన్ని తీసుకెళ్లే పైపు పగిలిపోవడంతో ఉక్కు ద్రావకం విరజిమ్మింది. ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద స్థలంలో డీజీఎం, సీనియర్ మేనేజర్, ఇద్దరు టెక్నీషియన్లు ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వీరిలో డీజీఎం-80, సీనియర్ మేనేజర్-80శాతం, ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికుల్లో ఒకరికి 90శాతం, మరొకరికి 60శాతం తీవ్రంగా కాలిన గాయాలు అయ్యాయి. మిగతా వారికి 20శాతం నుంచి 30శాతం వరకు కాలిన గాయాలయ్యాయి. స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించటంతో.. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కొంతమంది కార్మికులను మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.