Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేను చెప్పేది అబద్ధమైతే రాజీనామా చేస్తా
- దేశం ఏటు పోతున్నది..
- అప్పుల్లో ఘనుడు మోడీ
- అదాని వ్యవహారంపై నోరు మెదపరేం ?
- జనగణన ఎందుకు చేయడం లేదు : కేంద్రంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
దేశానికి అసలు లక్ష్యం ఉన్నదా..? ఎటు పోతున్నది..సమాఖ్య స్ఫూర్తి అంటే ఇదేనా..? అందుకే బీఆర్ఎస్ పెట్టానని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై సభ్యుల చర్చల అనంతరం సీఎం సమాధానం చెబుతూ 'చాలా చిత్ర విచిత్రమైన పోకడలు, వింత వింత ధోరణులు చూస్తున్నాం. ఎందుకు జరుగుతున్నరు అని ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉంటోంది. దేశంలో చెలరేగుతున్న ధోరణులు, ప్రజల ఆకాంక్షలు, ఆశలపె,ౖ ఆక్రోశాలపై ప్రజాజీవితంలో ఉన్నవారు చర్చ జరపాలి. అలాంటి వాటికే దేవాలయంలాంటి ఈ శాసనసభ వేదిక అని భావిస్తున్నా. దురదృష్టవశాత్తు జబ్బలు చరుచుకుంటూ సబ్జెక్ట్ వదిలి మరోకటి మాట్లాడటం, రకరకాల పెడధోరణులు శాసనసభలో, పార్లమెంట్లో కనిపించడం బాధాకరం. 75 ఏండ్ల స్వాతంత్య్ర దేశంలో విచిత్రమైన ధోరణులు, పక్షపాత వైఖరులు ఎందుకు కనిపిస్తున్నాయో ఆలోచించాలి' అని పిలుపునిచ్చారు.
తెలంగాణకు అన్యాయమే.
ఎప్పటిలాగే బడ్జెట్లో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసింది. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే.. తెలంగాణకు ఒక్కటీ రాదు.157 నర్సింగ్ కాలేజీలు మంజూరు చేస్తే, ఇందులోనూ ఒక్కటీ రాష్ట్రానికి రాదు? ఇది దేనికి సంకేతం? తెలంగాణనే కాదు ఈ వివక్ష ఎవరిపట్ల జరిగినా సరికాదు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. రూ.495 కోట్లు తెలంగాణకు రావాల్సింది ఇప్పించాలని కేంద్రాన్ని ఏడేండ్లుగా అడుగుతున్నం.. అడిగి అడిగి అరిగిపోయిన రికార్డులా మారింది.
గిరిజన యూనివర్సిటీ కూడా రాలేదు. ఈ నిమిషానికి మా చేతుల్లో అధికారం ఉంది.. మేమే కర్తలం, ఏదైనా చేయగలుగుతాం అనే పద్ధతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. దీన్ని ఎవరూ మెచ్చుకోరు' అని అభిప్రాయపడ్డారు.
పౌరసత్వం వదులుకుంటున్నారు..?
కేంద్రం మాటలు మాత్రమే కోటలు దాటుతున్నయి.. కానీ దేశంలో సాగునీటికి దిక్కులేదు, కరెంటుకూ దిక్కులేదు. రాజధాని ఢిల్లీలో మంచినీళ్లకు దిక్కులేదు. బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు 20లక్షల మంది భారతీయులు ఇండియన్ సిటిజన్ షిప్‌ను వదులుకున్నారు. ఎందుకు వెళ్తున్నరు దేశం నుంచి ? ఉన్న ఊరు.. కన్న వారిని వదిలిపెట్టి ఎందుకు వెళ్తారు? సక్కదనం బాగుంటే ఎందుకు వెళ్లాల్సి వస్తుంది. సిటిజన్ షిప్ వదులుకునే దౌర్భాగ్యం ఏందీ? వేరే దేశంలో పౌరసత్వం దొరికితే ఇక్కడ దావత్‌లు చేసుకునే దౌర్భాగ్యం ఏందీ? దేశంలో భయంకరమైన పరిస్థితులున్నాయంటూ' ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు పౌరసత్వం వదులుకొని పోతున్నరు. పారిశ్రామికవేత్త లు పారిపోతున్నరు. పరిశ్రమలు మూతపడుతున్నరు. ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నది. 2014లో మోడీ ఏమో చేస్తాడని అధికారం అప్పగిస్తే.. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యింది ప్రజల పరిస్థితి. మోడీ, బీజేపీ పార్టీ గెలిచింది.. భారతదేశ ప్రజలు ఓడిపోయారు. భారతదేశ ప్రజల ఓటమిలో భాగంగా తెలంగాణ కూడా కొంత ఓడిపోయింది. ఇవాళ రాష్ట్రం జీఎస్డీపీ 13.27 లక్షల కోట్లు. వాస్తవంగా మోడీ ప్లేస్‌లో మన్మోసింగ్ ఉన్నా.. భారతదేశ ప్రభుత్వం.. తెలంగాణ లెక్క పని చేసినా జీఎస్డీపీ 16లక్షల కోట్లు ఉండాలి. ఒక్క తెలంగాణనే రూ.3 లక్షల కోట్లు నష్టపోయింది. ఇది భవిష్యత్ తరాలకు తెలియాలని చెబుతున్నా. మన్మోహన్ హయాం, మోడీ హయానికి పోల్చుకుంటే మోడీ పాలనలో ప్రతీరంగంలోనూ దేశం నష్టపోయింది. తమాషా ఏంటంటే.. దివాళా తీసుకుంటూ కూడా మేమే గొప్పొళ్లమని చెప్పుకుంటున్నరు. పార్లమెంట్లో ప్రధాని ఘోరంగా మాట్లాడారు.. అదానీ సంగతి ఏంటీ ?.. ఏం జరుగబోతోంది ఈ దేశంలో.. ఇప్పుడు భారతదేశం ఏం చేయబోతున్నది? ఇదే విషయాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ ఢిల్లీలో ప్రధానిని డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని ఒక్కమాట మాట్లాడలేదు. ' అని చెప్పారు.
పెట్టుబడులు వద్దా ?
'భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలంటే వ్యవస్థలు ఎలా ఉన్నారు ? సెబీ ఎలా ఉన్నది ? అని అంతర్జాతీయ పెట్టుబడుదారులు ఆలోచిస్తారు పెట్టుబడిదారులు థర్డ్‌క్లాస్ కంట్రీ అంటే దెబ్బతినిపోతాం. హిండెన్‌బర్గ్ ఏం స్టడీ ఏం చేసిందో.. మనకు తెలియదు. ఒకే దెబ్బకు రూ.10లక్షలకోట్ల ఆస్తులు కరిగిపోయినరు అని చెబుతున్నరు. తాజా లెక్క 108 బిలియన్ డాలర్లు కనిగిపోయినరు.. ఆ సంస్థ ఉంటదా ? ఆయన ఉంటాడా?.. అదాని మన దగ్గర కూడా పెట్టుబడులు పెడుతా అన్నాడు.రాకపోవడమే మంచిదైంది. ఈ కంపెనీల్లో భారతీయ బ్యాంకులు, ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టాయి. ఎల్ఐసీలో 25 కోట్ల మంది డిపాజిటర్లు ఉన్నారు. పాలసీదారులందరూ ఆందోళనకు గురవుతున్నారు. వీరి గురించి ప్రధాని నోటి నుంచి ఒక్కమాట కూడా రాలేదు. కానీ, మా దోస్తు భాగోతం బయటపడిందనే ఆక్రోశం ప్రధానిలో కనిపించింది. ఎన్నడో చనిపోయిన నెహ్రూ, ఇందిరాగాంధీ పేర్లను తీసుకువచ్చి ఆమె గవర్నమెంట్లు కూలగొట్టిందని మోడీ చెప్పారు. రాహుల్ గాంధీ లేచి నువ్వు తక్కువ కూలగొట్టినవా అని చెబుతున్నరు.ఇది ఛోటే భారు సుభానల్లా.. బడేబారు మాషా అల్లా అన్నట్టుందని వ్యాఖ్యానించారు.
ఆర్దికాభివృద్ధి ఏక్కడ ?
'ప్రధాని మోడీ 2022-23 నుంచి 2023-24 దాటేలోపు ఇండియా ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ గల దేశమవుతుందని చెప్పారు. అది పెద్ద జోక్. ప్రస్తుతం చేరుకున్నది మాత్రం 3.3 ట్రిలియన్లే. ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల గురించి చూస్తే అమెరికా ఆర్థిక శక్తి.. ఎకానమీ 25 ట్రిలియన్ డాలర్లు.. చైనా ఎకానమీ 18.3 ట్రిలియన్లు, జపాన్ 4.3 ట్రిలియన్లు, జర్మనీ నాలుగు ట్రిలియన్లు..భారతదేశం మాత్రం 3.3 ట్రిలియన్ల వద్దే ఉంది. ఎకానమీ ఉండేది వేరు.. అసలు కథ వేరు. తలసరి ఆదాయం లెక్కిస్తేనే రియల్ స్టోరీ తెలుస్తుంది. ప్రపంచంలో 192 దేశాలుంటే, భారతదేశం ర్యాంకు 139 స్థానంలో ఉంది. పక్కనే బంగ్లాదేశ్ ర్యాంకు 138, భూటాన్, శ్రీలంక ర్యాంకులకంటే భారతదేశం ర్యాంకు తక్కువగా ఉన్నది' అని గుర్తు చేశారు. బీబీసీ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ ఇంగ్లిష్ చానల్. ఇందులో గోద్రా అల్లర్లకు సంబంధించి ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. దాని మీదా సుప్రీంకోర్టులో బీజేపీకి చెందిన అశ్వినీ ఉపాధ్యాయ అనే వకీలు పిటిషన్ వేశారు. ఇంత అహంకారమా ? బీబీసీ అంటే జీ న్యూసా..? ఈడీ, బోడీకి భయపడేందుకు. బీబీసీని బ్యాన్ చేయాలని సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే.. దేశానికి అలంకారమా? ప్రపంచం మన గురించి ఏమనుకుంటది.అని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎల్ఐసీ ప్రయివేటీకరణ ఎందుకు ?
దేశంలో అడ్డగోలుగా ప్రయివేటీకరణ కొనసాగుతున్నది. గుడ్డి ఎద్దు చేన్లో పడ్డట్టుగా సాగున్నది. రైళ్లు, విమానాలు, పోర్టులు, రోడ్లు, రైల్వేస్టేషన్లు పోయాయి. ప్రైవేటు రైళ్లు వస్తున్నయి. చివరికి ఎందుకు ఎల్ఐసీని ప్రైవేటీకరణ చేయాలి. కేంద్ర బడ్జెట్‌కు మించి ఆస్తులు ఉన్నాయి. రూ. 42లక్షల కోట్ల నుంచి, 45లక్షల కోట్ల వరకు లావాదేవీ లు చేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అది. ఎల్ఐసీ భారతీయ ఆత్మ, దానీ మీద అంత నమ్మకం. ఎందుకు అమ్మాలి ? ఎంత మంది అడిగినా దీనికి సమాధానం చెప్పరు. దీన్ని ఏమనుకోవాలి. 'సోషలైజేషన్ ఆఫ్ లాసెస్.. ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్' ఇది మోడీ అనుసరిస్తున్న విధానం. ఇది ఏమాత్రం సరికాదు. ఇండియన్ ఏయిర్ లైన్స్ ప్రైవేటు కంపెనీ. టాటాలకు చెందిన కంపెనీ. 1948లో కొద్దిగా 49శాతం కొనుగోలు చేసి.. 1953లో నెహ్రూ నాయకత్వంలోని ప్రభుత్వం టాటాల నుంచి తీసుకొని ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను ప్రభుత్వరంగంలోకి తీసుకువచ్చింది. ఇప్పుడు దాన్ని తిరిగి టాటాలకు ధారాదత్తం చేశాడు మోడీ. ప్రభుత్వం పరిపాలన చేయకపోతే ఎలా అని అభిప్రాయపడ్డారు.
అప్పుల్లో మోడీ ఘనుడు
అప్పులు చేయడంలో మోడీని మించిన ఘనుడు లేడని సీఎం కేసీఆర్ విమర్శించారు.కాంగ్రెస్ పరిపాలనలో వార్షిక వద్ధి రేటు 6.8 శాతం ఉండేది. బీజేపీ హయాంలో 2014-23 వరకు 5.5శాతానికి వచ్చింది. ఇది పెరుగుదలా? తగ్గుదలా? కాంగ్రెస్‌ది అంతులేని భావదారిద్య్రం. ఇప్పుడు ఈ బాధ మాపై పడ్డది. ఈ విషయంపై పార్లమెంట్‌లోనూ ఎవరూ మాట్లాడడం లేదు. యూపీఏ పాలనలో 24 శాతం గ్రోత్‌రేటు ఎక్కువ. 2004లో యూపీఏ అధికారంలోకి ఉన్నప్పుడు జీడీపీకి అప్పుల శాతం 66.7 శాతం ఉండేది. మన్మోమోహన్ పాలన ముగిసే సరికి 52 శాతానికి తగ్గిపోయింది. దాదాపు 14శాతం మన్మోహన్ సింగ్ అప్పుల శాతాన్ని తగ్గించారు. ఇంత పెద్ద మాటలు మాట్లాడే మోడీ హయాంలో 2014 నుంచి ఇప్పటి వరకు చూస్తే.. 56.2శాతానికి అప్పులు పెరిగాయి. మోదీ ఇంకా ఎవరిపై ఘీంకారాలు, హీంకారాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
రేషన్ డీలర్‌తో దేశ ఆర్థికమంత్రి కొట్లాట
సువిశాల భారతదేశానికి ఆర్థిక మంత్రి.. కామారెడ్డి జిల్లా రేషన్ దుకాణంలో మోడీ ఫొటో పెట్టలేదని డీలర్‌తో కొట్లాడారని సీఎం కేసీఆర్ విమర్శించారు. డీలర్‌తో దేశ ఆర్థికశాఖ మంత్రి కొట్లాడుతరా? ఏం గొప్పదనం సాధించారని మోడీ ఫొటో పెట్టాలి? మెడికల్ కాలేజీ అడిగితే ఇవ్వలేదు. 300 ఎకరాలు ములుగు వద్ద జాగా ఇచ్చి ఐదేండ్లయింది. పార్లమెంట్ ఎంపీలు గిరిజన యూనివర్సిటీ గురించి అడిగితే మీ రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదని అంటున్నరు. ఇంతకన్నా అన్యాయం ఉంటదా ? అని అన్నారు.
నోట్లపై మోడీ చెప్పింది.. చేసింది వేర్వేరు
నోట్లు రద్దు సమయంలో ప్రధాని మోడీని వ్యక్తిగతంగా కలిశాను. ఆయన చెప్పింది వేరే.. చేసింది వేరు. ఆయన చెప్పిందాన్ని బట్టి నేను నమ్మి సమర్థించా. నల్లధనం పోతది, డిజిటల్ కరెన్సీ వస్తది.. టెర్రరిస్టులకు పైసలు దొరకకుండా ఉంటది అని ఎన్నో చెప్పారు. కానీ, డిమానిటైజేషన్‌కు ముందు 11-16లక్షల కోట్ల కరెన్సీ చెలామణి ఉంటే.. ప్రస్తుతం 32.43లక్షల కోట్లు కరెన్సీ చెలామణిలో ఉంది. మోడీ పాలనలో ఏ విధానం సక్సెస్ అయ్యింది. మాకు మందబలం ఉంది కాబట్టి.. ఏదిపడితే అదే మాట్లాడుతం, జైల్లో వేస్తాం అంటే ఎంత వరకు సమంజసం. కానీ, ఏ ప్రధానీ రైలును ప్రారంభించలేదు. ఎన్నిసార్లు వందేభారత్ రైలును ప్రధాని ప్రారంభిస్తారు ? ఇప్పటికీ 14 సార్లు ప్రారంభించారు. ఇంతకన్నా ఘోరం ఉంటదా? దేశంలో జనాభా గణన ఎందుకు చేపట్టడం లేదని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. దీని వెనుక కారణం ఏంటీ? అని నిలదీశారు. '140 సంవత్సరాలుగా ఏ ఒక్కసారీ జనాభా గణన ఆగలేదు. రెండుసార్లు ప్రపంచ యుద్ధాలు వచ్చినా జనాభా గణన ఆపలేదు. దానికి ఉండే ప్రాధాన్యం దష్ట్యా ఎప్పటికప్పుడే జరిగేది. గణన జరిగితే దేశం పరిస్థితి, ప్రజల పరిస్థితి తెలుస్తుంది. గణన చేపడితే వాళ్ల బండారం బయటపడుతుందని జరపడం లేదు. కుల గణన చేపట్టాలని బీసీ కులాలు అడుగుతున్నరు.. ఎందుకు లెక్కించడం లేదు. ఎస్సీలు 15శాతం అని చెప్పారు.. అది ఇప్పుడు 16.50శాతం నుంచి 17 శాతాన్ని మించిపోయింది. కొన్ని రాష్ట్రాల్లో 19శాతం దాటిపోయిందని చెప్పారు.
దేశానికి ఉన్న లక్ష్యం ఏంటీ..?
ఇప్పటికీ దేశానికి ఉన్న లక్ష్యం ఏంటీ ? ఎటు వైపు ప్రయాణిస్తున్నాం. లక్ష్యం లేని సమాజం, లక్ష్యం లేని దేశం ఎటు వైపు వెళ్తుంది. ఏమైనా చేసి ఎన్నికలు గెలువడమేనా లక్ష్యం. మన పిల్లలు ఇవాళ మెక్‌డోనాల్డ్‌కు వెళ్లి బర్గర్, సబ్‌వేకు వెళ్లి పిజ్జా తెచ్చుకుంటా అంటున్నరు. ఫుడ్ పాలసీ తీసుకువచ్చి అమలు చేస్తే ప్రపంచంలోనే అత్యధిక అద్భుతమైన ఫుడ్ ప్రాసెసింగ్‌గా ఉండాలి. అందుకే బీఆర్ఎస్ పార్టీకి 'అబ్కీ బార్ కిసాన్ సర్కారు' స్లోగన్ పెట్టినం అని అన్నారు.