Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) ఏర్పాటు చేయాలని తపస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏబీఆర్ఎస్ఎం అధ్యక్షులు జేపీ సింగాల్, ప్రధాన కార్యదర్శి శివానంద్ జిమీలను తపస్ ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ ఆదివారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెం జర్లను నియమించాలని కోరారు. ఎన్ఈపీ -2020 ప్రకారం ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలని తెలిపారు. దాన్ని ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. కేజీబీవీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ కింద లేనందున రెగ్యులర్ వేతనం పొందడం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించాలని సూచించారు.