Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అక్రమంగా మైనర్ బాలురను రవాణా చేస్తున్న ఐదుగురు నిందితులను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పదిమంది బాలురను రక్షించారు. ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ 18045)లో ఖమ్మం నుంచి సికింద్రాబాద్ వరకు బచపన్ బచావో స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి అక్రమంగా మైనర్ బాలురను రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 23 మంది మైనర్ బాలురను రక్షించినట్టు దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపారు. అన్ని రైళ్లలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నామని రైల్వే ఛైల్డ్‌లైన్ రాష్ట్ర సమన్వయకర్త వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.