Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీలో ప్రవేశపెట్టని సర్కార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రతీ రాష్ట్ర అసెంబ్లీలోనూ వార్షిక బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వాలు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికను ప్రవేశపెట్టటం ఆనవాయితీ. రాష్ట్ర ప్రభుత్వ జమా ఖర్చులతోపాటు నిధుల దుబారా, దుర్వినియోగం, పథకాలు, కార్యక్రమాల్లోని లోపాలు, లొసుగులను కాగ్ తన నివేదికలో ఎత్తి చూపుతూ ఉంటుంది. తద్వారా ప్రజలకు సంబంధించిన సొమ్మును సరైన పద్ధతుల్లో వినియోగించేలా సర్కారుకు దిశా నిర్దేశం చేస్తుంది. అంతటి కీలకమైన కాగ్ నివేదికను ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టకపోవటం గమనార్హం. చివరి రోజు కూడా దాని ప్రస్తావన లేకుండానే సమావేశాలు ముగిశాయి. ప్రధాన ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ... ఆదివారం ఈ అంశాన్ని శాసనసభలో లేవనెత్తినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సమాధానం రాకపోవటం గమనార్హం.