Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదానీ కుంభకోణాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ
విచారణ జరిపించాలి : ఆప్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ దిడ్డి సుధాకర్
- బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి ఆప్ యత్నం.. ఆరెస్టు
నవతెలంగాణ-సిటీబ్యూరో, సుల్తాన్ బజార్
దేశ సంపదను కొల్లగొడుతున్న అదానీ, అంబానీ లాంటి గ్యాంగ్స్టర్ పెట్టుబడిదారులకు మోడీ నాయకుడని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ దిడ్డి సుధాకర్ విమర్శించారు. అదానీ కుంభకోణాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపిచ్చిన దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా అదివారం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆప్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముట్టడికి యత్నించారు. ఆ పార్టీ జెండాలు, ప్లకార్డులు చేతబూని ఎల్ఐసీ, ఎస్బీఐలను రక్షించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆప్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో పలువురు ఆప్ కార్యకర్తలు కిందపడిపోయారు. ఆందోళనలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేసి నగరంలోని పలు పోలీస్ స్టేషన్లకు వారిని తరలించారు. ఈ సందర్బంగా డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ.. అదానీ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి ప్రధాని తన పదవిని దుర్వినియోగపరుస్తున్నారని విమర్శించారు. శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, నేపాల్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో బొగ్గు, పోర్టులు, ఇంధనం, రవాణా, విద్యుత్ ప్రాజెక్టులను ఆదానీకి అక్రమంగా ఇప్పించారన్నారు. అదానీతో దోస్తీ దేశద్రోహం అని, ఇద్దరూ కలసి దేశ సంపదను దోచుకొని అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ గ్రూప్ షేర్లలో ఎల్ఐసీ పెట్టుబడి విలువ రూ.77వేల కోట్ల నుంచి రూ.53వేల కోట్లకు పడిపోయిందని, ఫలితంగా ఎల్ ఐసీకి రూ.23,500 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పా రు. ఎల్ఐసీకి 'పబ్లిక్ మనీ' ద్వారా సమకూరిన నిధు లని ప్రధాని మోడీకి తెలియదా.. ఈ ప్రజా సొమ్ముకు ఎవరు భద్రత కల్పిస్తారని ప్రశ్నించారు. ఆ అక్రమ నిధులను బీజేపీ ఉపయోగించి ఎమ్మెల్యేలు, ఎంపీ లను కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తు న్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది భార తీయులు తమ పొదుపులను ఎల్ఐసీ, ఎస్బీఐ, పీ ఎన్బీలలో దాచారని, ప్రజలకు తమ పొదుపు డబ్బు ను ఎవరు చెల్లిస్తారని అని ప్రశ్నించారు. తక్ష ణమే ప్ర ధాని మోడీ మౌనం వీడి అదానీ కుంభ కో ణాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సు ప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆప్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు రాములు గౌడ్, శోభన్ భూక్యా, నేతలు డాక్టర్ హరిచ రణ్,టి. రాకేష్ సింగ్, ఆఫ్జాల్, మజీద్ పాలొన్నారు.