Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరణి పేరుతో భూ కబ్జాలు
- పార్టీ కార్యాలయాన్ని అప్పజెప్పాలి : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-మణగూరు
పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ 12 మంది ఎమ్మె ల్యేల కేసును సీబీఐ విచారించాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హెచ్చరించారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపుల పేరుతో మోహినాబాద్ ఫామ్ హౌస్‌పై నమో దైన కేసును బీజేపీ సీబీఐకి అప్పగించినట్టే, కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన 12 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసును కూడా సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు మళ్లీ అసెంబ్లీ గడప తొక్కకుండా చేస్తామని హెచ్చరించారు. ధరణి పేరుతో తెలంగాణ రైతన్నను అతిపెద్ద ప్రమాదంలో రాష్ట్ర ప్రభుత్వం పడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాలు ఆక్ర మించేందుకే ధరణి పథకం పుట్టుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని హామీ ఇచ్చారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ధరణి పథకాన్ని రద్దు చేస్తామన్నారు. కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు కుంభకోణం కంటే ధరణి దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా మారబోతుందని తెలిపారు. గోదావరి ముంపు మండలాల్లో నిరుద్యోగ యువకు లకు ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్య కర్తలు కష్టపడి కట్టుకున్న మణుగూరు పార్టీ కార్యాలయాన్ని వెంటనే అప్పగిం చాలని గౌరవంగా కోరుతున్నామన్నారు. ఎమ్మెల్యే రేగా కాంతారావు అప్పగిం చకుంటే జరగబోయే పరిణామాలు అన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు.
పార్టీ మారడంతో పినపాక ఎమ్మెల్యే పొందిన లబ్దిని పూర్తిస్థాయిలో విచా రణ జరిపి ప్రజలకు అప్పగించే పని కాంగ్రెస్ చేసి తీరుతుందని వెల్లడించారు. అశ్వాపురంలో రాత్రి బస చేసిన రేవంత్‌రెడ్డి.. పార్టీ స్థానిక నాయకులతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. సోమవారం ఇక్కడి నుంచి యథావిధిగా పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రలో కాంగ్రెస్ నాయకులు ఓరుగంటి బిక్షమయ్య, గాదె కేశవరావు, వెంకటరమణ, రాఘవులు తదితరులు పాల్గొన్నారు.