Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
రాష్ట్రంలో ఈనెల 22 నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన సోమవారం షెడ్యూల్ను విడుదల చేశారు. ఈనెల 28వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు ఆరు సబ్జెక్టులకు ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
అందుకనుగుణంగా ఆరు పేపర్లతో ప్రీఫైనల్ పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. డీఈవోలు, ఆర్జేడీలు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈనెల 22న ఫస్ట్ లాంగ్వేజ్, 23న సెకండ్ లాంగ్వేజ్, 24న ఇంగ్లీష్, 25న మ్యాథమెటిక్స్, 27న ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు సైన్స్, 11.20 నుంచి 12.50 గంటల వరకు బయలాజికల్ సైన్స్, 28న సోషల్ స్టడీస్ పరీక్షలను నిర్వహిస్తామని వివరించారు. వచ్చేనెల ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు ఆయా పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నాపత్రాలపై సమీక్ష, విద్యార్థులతో చర్చ ఉంటుందని తెలిపారు.
పరీక్షలు నిర్వహించే ప్రతిరోజూ సాయంత్రం 4.45 నుంచి 5.45 గంటల వరకు మరుసటి రోజు సబ్జెక్టుకు సంబంధించి విద్యార్థులు సన్నద్ధం కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 15 నుంచి పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం అందిస్తున్న సంగతి విదితమే. రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ఏప్రిల్ మూడు నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు.
15 నుంచి టెన్త్ పరీక్షలపై టీశాట్ అవగాహన
పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు మూడురోజులపాటు టీశాట్ అవగాహన కార్యక్రమాలను ప్రసారం చేయనుంది. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం రాధారెడ్డి సోమవారం మార్గదర్శకాలను విడుదల చేశారు. డీఈవోలు, సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులు, ఎంఈవోలు, గెజిటెడ్ హెడ్మాస్టర్లు, మండలం, క్లస్టర్ నోడల్ అధికారులు, ఎఫ్ఏసీ హెడ్మాస్టర్లు, పదో తరగతి సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు చూడాలని ఆదేశించారు.