Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీకి పోస్టుకార్డుల ఉద్యమం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పది శాతం గిరిజన రిజర్వేషన్లు అమలు చేయాలనీ, గిరిజన విశ్వవిద్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలనీ డిమాండ్ చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పోస్టు కార్డులను పంపే ఉద్యమాన్ని బీఆర్ఎస్ గిరిజన విద్యార్థి విభాగం చేపట్టింది. సోమవారం హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద ఆ సంఘం నాయకులు దాడి శ్రీనునాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి కేటీఆర్ చేనేత కార్మికుల సమస్యలపై ప్రారంభించిన పోస్టు కార్డు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని దీన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలని కోరారు.