Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఈవో వికాస్ రాజ్
నవతెలంగాణ - హైదరాబాద్
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తయ్యిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధా నాధికారి (సీఈవో) వికాస్‌రాజ్ తెలి పారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌లో ఓటర్ల నమోదు పూర్తయినట్టు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 31 నాటికి ఈ మూడు జిల్లాల్లో ఓటర్ల సంఖ్య 29,501గా నమోదైందని తెలిపారు. కొత్తగా 1,331 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని వివరిం చారు. వాటిని పరిశీలించి ఈనెల 23న జాబితా ప్రకటించి పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు కేంద్ర ఎన్ని కల సంఘానికి (ఈసీ) పంపిస్తామని వెల్లడించారు. గతంలో తిరస్కరిం చిన 1,440 దరఖాస్తుల్లో 788 సరై నవేనని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌తో తొమ్మిది జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటా, వ్యయ పరిమితి నిబంధన లేదని వివరించారు. ఏపీ, తెలంగాణలోని ఉపాధ్యాయ, పట్టభద్రులు, స్థానిక సంస్థల్లో ఖాళీ అవుతున్న స్థానాల్లో ఎన్నికలు జరగ నున్నాయి. ఏపీలో మూడు పట్ట భద్రులు, రెండు ఉపాధ్యాయ, ఎని మిది స్థానిక సంస్థల స్థానాలు కలిపి మొత్తం 13, తెలంగాణలో ఒక్కో ఉపాధ్యాయ, స్థానిక సంస్థల స్థానాల్లో ఎన్నికలు నిర్వహించను న్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియ నున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలోని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉపా ధ్యాయ స్థానంతో పాటు హైదరా బాద్ స్థానిక సంస్థల స్థానంలో ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది.