Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హైదరాబాద్ బ్యూరో
ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) మొదటిసారి తమ మెడికల్ ప్రతినిధుల కోసం ఈమోజ్ అనే వర్చువల్ వేదికను సోమవారం ఆవిష్కరించింది. ఇది వైద్యులు, మెడికల్ ప్రతినిధుల సమాచారాన్ని సులభతరం చేయనున్నది. దీని ద్వారా వైద్యులకు ఎక్కువ సౌకర్యాన్ని అందించడం, వారి విలువైన సమయాన్ని ఆదా చేయడం ద్వారా రోగికి మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని ఐఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె.ఆనంద్‌కుమార్ తెలిపారు. ''ఈ తరం ఆరోగ్య సంరక్షణ నిపుణులు డిజిటల్ కమ్యూనికేషన్ విధానంపై చాలా ఆసక్తి చూపుతున్నారు. మాదగ్గరకు వచ్చే రోగులకు ఆకర్షణీయమైన డిజిటల్ అనుభవాన్ని ఈ మోజ్ ద్వారా అందించాలని మేం భావిస్తున్నాం' అని తెలిపారు.