Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
శ్రీ శ్లోక పాఠశాల ఆరవ వార్షికోత్సవ వేడుకలు మంగళవారంనాడిక్కడి గండి మైసమ్మలో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారుల నత్యాలు, ఏకపాత్రాభినయాలు, విభిన్న విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద హాజరయ్యారు. స్థానిక ప్రముఖులు ప్రభాకర్‌రెడ్డి, రాజశేఖర్ యాదవ్,కౌన్సిలర్ సాయి యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుల్వామా దుర్ఘటన జరిగి నాలుగేండ్లు అయినందున, ప్రాణాలు కోల్పోయిన జవానుల స్మారకార్థంకొవ్వొత్తులు వెలిగించి మౌనం పాటించి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో పాఠశాల డైరెక్టర్ కుకుడాల ఆంజనేయులు చేస్తున్న కృషిని అభినందించారు. ఆరేండ్లుగా గండిమైసమ్మ పరిసర ప్రాంత విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ, వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దేందుకు కషి చేస్తున్నారని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటుగా అన్ని రంగాలలో రాణించాలని అభిలషించారు.