Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభినందనలు తెలిపిన ఎమ్డీ వీసీ సజ్జనార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం లో ఇటీవల జరిగిన 5వ ఆలిండియా మాస్టర్స్ గేమ్స్‌లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులు సత్తా చాటారు. సంస్థకు చెందిన ముగ్గురు ఉద్యోగులు ఆరు పతకాలను సాధించారు. వీరిని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అభినందించారు. స్విమ్మింగ్ 50 మీటర్ల విభాగంలో కే శ్రీనివాస్ రెండు బంగారు పతకాలు, 100 మీటర్ల విభాగంలో ఒక సిల్వర్ పతకం గెలుపొందారు. ఆర్చరీ 50 మీటర్ల విభాగం (మహిళా కేటగిరి)లో ఎమ్ అంజలి బంగారు పతకం సాధిం చారు. పురుషుల కేటగిరి ఆర్చరీ 50 మీటర్ల విభాగం కంపౌండ్ బీఓడబ్ల్యూ లో కే కిషన్ సిల్వర్, షౌట్ ఔట్లో కాంస్య పతకాలు సాధించారు. ఈ ఏడాది మేలో సౌత్ కొరియాలో జరిగే ఇంటర్నేషనల్ ఆసియా-పసిఫిక్ మా స్టర్స్ గేమ్స్‌కు వీరు ముగ్గురూ ఎంపిక య్యారు. పోటీల్లో టీఎస్ఆర్టీసీ ఉద్యో గులు ఆరు పతకాలు సాధించడంపై సజ్జనర్ హర్షం వ్యక్తం చేశారు. బుధ వారం వారిని తన కార్యాలయంలో అభినందించారు. కార్యక్రమంలో సీపీఎం కష్ణకాంత్, స్పోర్ట్స్ ఆఫీసర్ వెంకట నారాయణ, ఫిజియో హిమన్షు కుమార్ పాల్గొన్నారు.