Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రయివేటు కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులకూ ఎగ్జామినర్లుగా అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రయివేటు టీచర్లు, లెక్చరర్ల ఫెడరేషన్ (టీపీటీఎల్ఎఫ్) రాష్ట్ర కన్వీనర్ ఎ విజరుకుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ అధ్యాపకులను మాత్రమే ఎగ్జామినర్లుగా నియమిస్తున్నారని గురువారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. వారొక్కరికే ఈ పని కల్పించడం వల్ల అది వారికి కూడా భారమవుతున్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రయివేటు కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులకూ అవకాశం కల్పిస్తే వారికి ప్రయోజనం కలుగుతుందని సూచించారు. అలవెన్సుతోపాటు టీఏ, డీఏ పెంచాలని తెలిపారు. అవి తప్పకుండా ఇచ్చే విధంగా విద్యాశాఖ చొరవ చూపాలని కోరారు.