Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో బీసీలు అభివృద్ధి సాధించాలంటే చట్టసభల్లో ప్రవేశించాలనీ, అందుకు పార్లమెంటులో అవసరమైన రాజ్యాంగ సవరణను చేపట్టాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ కోరారు. అందుకనుగుణంగా కేంద్రానికి సిఫారసు చేయాలంటూ జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ చైర్మెన్, కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారాంకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం సురేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. వివిధ వర్గాల, చేతి వృత్తుల , కులవృత్తుల వివరాలతో పాటు అనేక ఆర్ధిక, వాణిజ్య అంశాలు జనగణన ప్రభుత్వానికి ఉపకరిస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో,విద్య, ఉద్యోగ అవకాశాల్లో 27 శాతం రిజర్వేషన్లు క్షేత్ర స్థాయిలో పూర్తిగా అమలు కావటం లేదని పేర్కొన్నారు. దీంతో బీసీలు పెద్ద ఎత్తున అవకాశాలకు దూరమవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు దొంత ఆనందం, రాష్ట్ర కమిటీ సభ్యులు చాపర్తి కుమార్ గాడ్గే తదితరులు పాల్గొన్నారు.