Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆప్, బీఆర్ఎస్లకు ఇరిగేషన్ పాలసీ కాదు లిక్కర్ పాలసీనే కరెక్టు అని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పర్యటన కేసీఆర్ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికేనని విమర్శించారు. వారివురు ఒకరినొకరు పొగుడుకోవటం కోసం క్విడ్ ప్రో కో చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాలు నడుపుతా అని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో మద్యానికి దూరంగా ఉన్న ప్రజలకు ఇంటిఇంటికీ మద్యం ఏరులై పారేలా ఆప్ సర్కారు చేసిందని విమర్శించారు. భగవంత్‌మాన్‌కు మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ నిర్వాసితులను, పడావుబడ్డ డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లను చూపిస్తే బాగుండేదని సూచించారు.