Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వంద కోట్లకు పైగా అప్పులు చేయటం ద్వారా దేశాన్ని తిప్పలు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం... రుణాల విషయంలో తిరిగి తెలంగాణను విమర్శించటం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఇలాంటి వైఖరి సరికాదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సూచించారు. దేశంలోని ఒక్కో వ్యక్తిపై ప్రధాని మోడీ మూడు రెట్ల అప్పును మోపారని ఆమె గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. మరోవైపు పేదలకు ఆసరాగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నీరు గార్చేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పథకానికి సంబంధించిన జాబ్ కార్డుల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ప్రజా ధనాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్నదని వాపోయారు. నిజామాబాద్ నగరంలో ఏర్పాటవుతున్న ఐటీ హబ్ పనులు చివది దశకు చేరుకున్నాయని కవిత తెలిపారు.