Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి జితేంద్రసింగ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
శాస్త్రవేత్తలు మరింత సృజనాత్మకతను, నైపుణ్యాన్ని పెంచుకోవాలని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ కోరారు. ప్రజలకు కొత్త ఆలోచనా నైపుణ్యాలను అందించేందుకు అన్ని విధాలా వారు కృషి చేయాలన్నారు. అందుకు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల సహకారాన్ని పెంచాల్సిన అవసరముందని తెలిపారు. ఇందులో భాగంగా సమర్థవంత మైన నాయకత్వానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గురువారం హైదరాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా బెల్లా విస్టా క్యాంపస్లో నాయకత్వంపై నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లా డారు.దేశంలోని శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు కొత్త ఆవిష్కరణల కోసం పని చేస్తున్నప్పుడు వారికి నిర్మాణాత్మక శిక్షణ అవసరమని చెప్పారు. ఈ సందర్భంగా పలు కోర్సులను మంత్రి ప్రారంభించారు.