Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మహబూ బ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి తొలిరోజు నలుగురు అభ్యర్థులు ఆరు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలా గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. నలుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆరు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని వివరించారు. వారిలో కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి రెండు సెట్లు, అన్వర్ ఖాన్ రెండు సెట్లు, బి భుజంగరావు, గుర్రం చెన్నకేశవరెడ్డి ఒక్కో సెట్ నామినేషన్లను సమర్పించారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొదటి రోజు నామినేషన్లు దాఖలు కాలేదని తెలిపారు.