Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బి.యాదయ్య మరణం తీరని లోటు
- ఎం సూర్యనాయక్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పేదల పెన్నిధి బి. యాదయ్య మరణం పార్టీకి తీరని లోటని ట్రైఫెడ్ మాజీ సభ్యులు, సీనియర్ నేత ఎం. సూర్యనాయక్ తెలిపారు. నాటి కాంగ్రెస్ పాలకులతో మాట్లాడి హైదరా బాద్ నగరంలో ఆయన పేదల కోసం ఎన్నో గుడెసెలు వేయించారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్‌గా, భాగ్యనగర్ బ్యాంక్ చైర్మెన్‌గా సేవలందించారని కొనియాడారు. పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు పని చేసిన ఆయన... దామోదర్ సంజీవయ్య హయాంలో ఎస్సీ, ఎస్టీ విభాగం చైర్మెన్‌గా అనేక కార్యక్రమాలు నిర్వహించారని తెలి పారు. సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహించి, పేదల మెప్పుపొందా రని గుర్తు చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, ఆయన మరణం పట్ల సంతాపాన్ని తెలిపారు.