Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారతీయ రైల్వేలు, ఇండియా పోస్ట్ సంయుక్తంగా వినియోగదారుల ఇంటివద్దకే పార్శిల్ సేవలను అందించేందుకు కార్యాచరణ రూపొందించాయి. గతిశక్తి కార్గో ఎక్స్‌ప్రెస్ సమయ సూచికను దృష్టిలో ఉంచుకుని రేణిగుంట నుంచి క్యాడ్బరీ చాక్లెట్లను లోడ్ చేశాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్, భారత పోస్ట్‌తోపాటు రైల్ పోస్ట్ గతి శక్తి ఎక్స్‌ప్రెస్ కార్గో సర్వీసును గురువారం హైదరాబాద్‌లోని కాచిగూడలో ప్రారంభించారు. అక్కడి నుంచి హజ్రత్ నిజాముద్దీన్‌కు మొదటి పార్శిల్ రైలు ద్వారా సేవలు ప్రారంభమయ్యాయని వివరించారు. వినియోగదారులకు డోర్ టు డోర్ పార్శిల్ సేవలను అందిందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇంటివద్ద నుంచి పార్శిల్ లోడింగ్ చేసే స్థలం వరకు, పార్శిల్ లోడింగ్ చేస్తే స్థలం నుంచి వినియోగదారుల ఇంటికి తపాలా శాఖ సేవలను అందిస్తుందని పేర్కొన్నారు.